పోలీస్ స్టేషన్ల పరిధిలో .. వాహనాల తనిఖీల్లో రూ. 4,73,500 సీజ్

అలంపూర్, వెలుగు:  జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో, చెక్ పోస్టుల్లో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో  రూ. 4,73,500  సీజ్ చేసి  జిల్లా ఎన్నికల అధికారులకు  అప్పగించినట్లు  ఎస్పీ  రితిరాజ్  తెలిపారు.  

గట్టు పోలీస్ స్టేషన్  పరిధిలో  రూ. 2,76,000ను, ఉండవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లూరు  చెక్ పోస్టు వద్ద రూ. 1,97,500 ను సీజ్  చేశారు.  ఎన్నికల కోడ్ అమల్లో  ఉందని, రూ. 50 వేలకు మించి  ఎక్కువ డబ్బులను తీసుకెళ్లవద్దని  తెలిపారు.